విడాకులు మంజూరైన వెంటనే భర్తను కోర్టులోనే చితకబాదిన భార్య బంధువులు - యువకుడిని కొట్టిన మహిళలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడిని కొందరు మహిళలు చితక్కొట్టారు. ముజఫర్‌నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడి జరిగింది. ముజఫర్‌నగర్‌కు చెందిన సబియా అనే యువతికి మేరఠ్‌కు చెందిన రషీద్‌తో వివాహం జరిగింది. అయితే వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. రాజీకి ప్రయత్నించినా విఫలం కాగా విడాకులు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి వాదనలు విని విడాకులు మంజూరుచేసింది. విడాకులు మంజూరైన అనంతరం రషీద్‌పై సబియా కుటుంబసభ్యులు దాడికి దిగారు. ముగ్గురు మహిళలు ఒక్కసారిగా రషీద్‌ను చుట్టుముట్టి కొట్టారు. వెంటనే అప్రమత్తమైన రషీద్ కుటుంబసభ్యులు చుట్టుపక్కల వారి సాయంతో వారిని అడ్డగించారు. ఈ గొడవ మొత్తాన్ని ఒకరు వీడియో తీయగా ప్రస్తుతం ఇది స్థానికంగా వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST