Water from neem tree: ప్రకాశం జిల్లాలో వింత.. వెేప చెట్టు నుంచి నీళ్లు.. చూసేందుకు ఎగబడ్డ ప్రజలు
Water from neem tree: పొద్దున్నే దంతధావనానికి వేపపుల్ల.. మధ్యాహ్నం కాసేపు అలా సేద తీరడానికి వేపచెట్టు నీడ.. పిల్లలకు ఏ అమ్మవారో సోకితే వేపాకుతో పడక.. సాయంత్ర సమయంలో కబుర్లు చెప్పుకోడానికి వేపచెట్టు కింది రచ్చబండ.. ఇలా మనిషి దినచర్య అంతా వేపచెట్టుతో పెనవేసుకుని సాగిపోయేది. మానవ మమగుడకు తనదైన పాత్ర వహిస్తున్న వేప చెట్టు నుంచి పాలు రావడం వంటి విని ఉంటాం.. చూసి ఉంటాం.. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. వేపచెట్టు నుంచి నీరు దారాళంగా వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో.. స్థానికులు ఓ వేప చెట్టును నరుకుతూ ఉండగా అకస్మాత్తుగా వేప చెట్టు నుండి మంచినీరు ఉబికి వచ్చింది. ధారలా కారుతున్న మంచినీటి చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ నీటిని తాగి చూశారు. నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయని వారు అన్నారు. ఈ ఘటనను చూడటానికి స్థానిక ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన.. వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా స్థానికంగా వైరల్ అవుతోంది.