భూకంపంతో ఊగిపోయిన భవనం.. ప్రాణాలకు తెగించి శిశువులను కాపాడిన నర్సులు
తుర్కియేలో భూకంపం వచ్చిన సమయంలో ఇద్దరు నర్సులు తమ ప్రాణాలకు తెగించి నవజాత శిశువులను కాపాడిన వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం రిక్టర్‌స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంప సమయంలో గజియాన్తెప్లోని ఆస్పత్రి భవనం ఊగిపోయింది. దీనిని గమనించిన నర్సులు.. అక్కడి నుంచి పారిపోకుండా ఇంక్యుబెటర్‌లో ఉన్న శిశువులు పడిపోకుండా కాపాడారు. వీరిని దెవ్లెట్ నిజాం, గజ్వాల్ కాలిస్కన్గా గుర్తించారు. ఈ వీడియోను తుర్కియే నేత ఫత్మా సహీన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వారి ప్రాణాలు పణంగా పెట్టి శిశువులను కాపాడిన నర్సులను నెటిజన్లు అభినందిస్తున్నారు.