'నీ ఓటే రాజ్యమేలే సీటయిందిరా - దాన్ని అమ్ముకుంటే నీ బతుకు అగమవునురా'
Published : Nov 29, 2023, 2:47 PM IST
Vote Awareness Songs By Jangaon Artists : ఓటు అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వజ్రాయుధం. పోలింగ్ రోజున అందరూ బాధ్యతగా ఓటు వేయాలి. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. లేదంటే.. వచ్చే ఐదేళ్లూ బాధపడాల్సి వస్తుంది. అందుకే ఓటు వేసే ముందు మంచి నాయకులకు ఎన్నుకోవాలని జనగామ కళాకారులు పాటల ద్వారా కోరుతున్నారు. నీ ఓటే రాజ్యమేలే సీటయిందిరా - దాన్ని అమ్ముకుంటే నీ బతుకు అగమవునురా అంటూ అవగాహన కల్పిస్తున్నారు.
Voting Awareness Songs in Telangana 2023 :నోటుకు ఓటు మన జీవితాలకే చేటు అని.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రతి ఒక్కరు సక్రమంగా వినియోగించుకోవాలని.. తమ మాట, పాటల ద్వారా ఓటు నిజాయితీగా వేయాలంటూ కోరుతున్నారు జనగామ కళాకారులు. మందుకో, విందుకో ఓటును అమ్ముకున్నారా ఇక ఐదేళ్ల మీ భవిష్యత్తు అంధకారమేనని ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. ఓటు వేసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పాటల ద్వారా చెబుతున్నారు జనగామ సాంస్కృతిక సారధి కళాకారులు. స్వచ్ఛమైన పాలనకు స్వేచ్ఛగా ఓటు వేయండంటూ.. వీరు ఆలపించే పాటలు ఓటర్లలో ప్రేరణ కలిగిస్తున్నాయి.