పదేళ్లలో కేసీఆర్ ప్రజల నెత్తిన అప్పుల భారం మెపారు : విజయశాంతి - విజయశాంతి లెటెస్ట్ న్యూస్
Published : Nov 25, 2023, 7:19 PM IST
Vijayashanthi Election Campaign In Nirmal : నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరి రావుకు మద్దతుగా నియోజకవర్గంలోని సారంగాపూర్, బీరవెల్లి, దిలావర్పూర్ గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. విజయశాంతిని చూసేందుకు మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన అనంతరం దళిత అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని.. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన కొనసాగిందన్నారు. వారి అవినీతితో ప్రజల నెత్తిన అప్పుల భారం మోపారని మండిపడ్డారు.
Vijayashanthi Fires On KCR :డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి తిన్న ప్రతి పైసాను కక్కిస్తామని, ఈ ఎన్నికల్లో శ్రీహరి రావుకు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే చేతి గుర్తుకే ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు అంశాలను విజయశాంతి ప్రజలకు వివరించారు.