తెలంగాణ

telangana

ETV Bharat / videos

మెట్రో స్టేషన్​లోనే ప్రయాణికుడి మూత్ర విసర్జన వీడియో వైరల్​ - viral VIDEO OF URINATING ON METRO TRACK

By

Published : Nov 7, 2022, 10:44 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

దిల్లీ మెట్రో​లో ఓ వింత ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు మెట్రో స్టేషన్​లోనే మూత్ర విసర్జన చేశాడు. ఈ అనాగరిక చర్యను సంజీవ్ బబ్బర్ అనే వ్యక్తి వీడియో తీసి అక్టోబర్ 29న సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసి దిల్లీ మెట్రోను ట్యాగ్​ చేశాడు. వీడియో వైరల్ కావడం వల్ల డీఎమ్​ఆర్​సీ అధికారులు స్పందించారు. దక్షిణ దిల్లీలోని మాలవీయ నగర్​ మెట్రో స్టేషన్​లో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. వైరల్ వీడియో, సీసీటీవీల ఫుటేజ్​ ఆధారంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి చర్యలను తమ దృష్టికి తీసుకువచ్చివ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు జరిగితే టోల్​ ఫ్రీ నంబర్​కు ఫోన్​ చేసి తమకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details