తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాపాడాల్సినవారే అంబులెన్స్​తో తొక్కించారు.. పక్కకు లాగేసి వెళ్లిపోయారు - అంబేద్కర్​నగర్​ న్యూస్​

By

Published : May 15, 2022, 7:09 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Ambulance Accident In UP: ఉత్తర్​ప్రదేశ్​ అంబేద్కర్​నగర్​లో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాపాడాల్సిన వైద్య సిబ్బందే అంబులెన్స్​తో ఢీ కొట్టి.. నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లారు. ఏప్రిల్​ 13న అక్బర్​పుర్​ ఓవర్​ బ్రిడ్జి సమీపంలో పరీక్ష రాసేందుకు బైక్​పై వెళుతున్న ముగ్గురు యువకులను అంబులెన్స్​ ఢీ కొట్టింది. యువకుల్లో ఒకరిని 108 వాహనం కొంత దూరం లాకెళ్లింది. అనంతరం సిబ్బంది దిగి వెనక చక్రం కింద ఉన్న బాధితుడిని బయటకి లాగి.. రోడ్డుపైనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు సైతం సహాయం చేయలేదు. చివరకు స్థానికలు వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details