తెలంగాణ

telangana

variety fish in Warangal : ఈ చేపలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

By

Published : Jun 14, 2023, 4:06 PM IST

వింత చేపలు

fishermen found for variety fish in Warangal :  సాధారణంగా వింత చేపలు, అందంగా ఉన్న చేపలు మత్స్యకారుల వలకు చిక్కితే సంబర పడతారు. వాటిని చూసేందుకు జనం కూడా ఎగబడతారు. కానీ తాజాగా వరంగల్ జిల్లాలో దొరికిన చేపలను చూసి అమ్మ బాబోయ్ అని జనం భయపడుతున్నారు. వీటిని చూస్తే చేపలందు ఈ చేపలు వేరయా అనాల్సిందే.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి తాళ్లకుంట తండాలో  స్థానికులకు వింత చేపలు చిక్కాయి. స్థానిక గిరిజనులు ఎస్సారెస్పీ కెనాల్ కాలువలోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టడానికి వల వేయడంతో రెండు వింత చేపలు పడ్డాయి. ఆ చేపలు ఒంటిపై నలుపు, తెలుపు రంగుల్లో మచ్చలు కలిగి ఉన్నాయి . అంతే కాదు చేప నోరు కూడా కింది భాగంలో ఉంది. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియడంతో వింత చేపలను చూసేందుకు  తరలివచ్చారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపలను చూడలేదని స్థానికులు తెలిపారు. ఈ చేపలను సక్కర్ మౌత్ క్యాట్ చేపలు అంటారని వెటర్నరీ వైద్యులు తెలిపారు. ఇలాంటి వింత చేపలు సముద్రంలో అరుదుగా ఉంటాయన్నారు. 

ABOUT THE AUTHOR

...view details