తెలంగాణ

telangana

Ujjaini Mahankali Bonalu in Singapore

ETV Bharat / videos

Bonalu in Singapore : సింగపూర్​లో ఘనంగా బోనాల ఉత్సవాలు - Ujjaini Mahankali Bonalu in Singapore in telugu

By

Published : Jul 9, 2023, 7:15 PM IST

Bonalu Celebrations in Singapore: సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్‌ - టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో బోనాల పండగ వేడుకలు వైభవంగా జరిగాయి. భాగ్యనగరంలో ఉజ్జయని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూర్‌లో కూడా చేయడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’లోని శ్రీఅరసకేసరి శివాలయంలో ఘనంగా చేసుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో స్థిరపడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. ఇతరులు సుమారు 800 మంది భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు.

తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో తొలిసారి 2017లో బోనాల పండుగ నిర్వహించారు. దీంతో సింగపూర్‌కి ఈ పండగ ప్రాముఖ్యత అక్కడి స్థానికులకి పరిచయం అయింది. బోనాల పండగలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తెలంగాణ కల్చరల్ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details