బంగారు ఆభరణాలు చోరీ చేసి డిజైన్ నచ్చలేదని తెలివిగా ఎస్కేప్ - నగలను కొనడానికి వచ్చి బంగారం చోరీ
రోజురోజుకూ దొంగల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రకరకాల పద్దతుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లో ఇద్దరు మహిళా దొంగలు నగలు కొనడానికి వచ్చి బంగారు చెవి కమ్మలను ఎత్తుకెళ్లారు. బస్తీ జిల్లాలోని వాల్తేర్గంజ్లో ఈ ఘరానా చోరీ జరిగింది. ఇద్దరు మహిళలు నగలను కొనడానికని బంగారం షాపునకు వెళ్లారు. డిజైన్లు చూపించమని అడిగారు. దాంతో షాపు యజమాని డిజైన్లను చూపించే పనిలో ఉన్నారు. అదనుగా చూసుకొని మహిళా దొంగ చెవి కమ్మలను తీసుకుని దాచింది. తర్వాత డిజైన్లు నచ్చలేదని వెళ్లిపోయారు. యజమాని అన్ని సర్దుతుండగా కమ్మలు పోయాయని గుర్తించారు. తీరా సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.