స్టేషన్ సమీపంలోనే రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. ఒక్కసారిగా మంటలు.. లోకో పైలట్ మృతి - మధ్యప్రదేశ్ వారలత్లు
మధ్యప్రదేశ్‌లోని శాహ్డోల్ జిల్లాలో భారీ రైలు ప్రమాదం జరిగింది. సింగ్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు.. పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో లోకో పైలట్ మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సింగ్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఆగింది. అదే సమయంలో అదే ట్రాక్‌లో వచ్చిన మరో గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. ఒక రైలు బోగీలు.. మరో ట్రైన్‌పై పడ్డాయి. ట్రాక్ మొత్తం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో లోకో పైలట్ రాజేశ్ ప్రసాద్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న వైద్య కళాశాలలో చేర్పించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఇంజిన్లు చేరుకుని చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చాయి. బిలాస్‌పుర్-కట్నీ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు.