TS Transco Genco CMD Comments on IAS Officers : 'కేసీఆర్ చెప్పినా నిధులు విడుదల చేయడం లేదు..' జెన్కో సీఎండీ హాట్‌కామెంట్స్ - ఐఏఎస్ అధికారులపై ప్రభాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు
Published : Oct 16, 2023, 5:48 PM IST
TS Transco CMD Prabhakar Rao Comments on IAS Officers : తెలంగాణ విద్యుత్ సంస్థలకు వస్తున్న ఆదరణ చూసి.. కొంతమంది ఐఎఎస్ అధికారులు ఓర్వలేక పోతున్నారని ట్రాన్స్ కో- జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు.. సంస్థ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవాళ మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేన్ ఆఫ్ తెలంగాణ ప్రారంభోత్సవం సందర్బంగా.. సీఎండీ ప్రభాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
TS Transco Genco CMD Prabhakar Rao : ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా.. ఐఏఎస్ అధికారులు విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని కొంత మంది అధికారులు సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు. ఇదే విషయంలో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదన్నారు. ఈ విషయం చెప్పిన తర్వాత ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో- జెన్కో సీఎండీలైన తమను పదవుల నుంచి తొలగించే కుట్ర కూడా జరగొచ్చన్నారు. అయినా సరే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తమను ఈ ఐఏఎస్ అధికారులు ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పనితనం చూసి ఉద్యోగాలు ఇచ్చారన్నారు.