Tractor Stuck on Railway Track at Nalgonda : పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్‌ప్రెస్ నిలిపివేత - తెలంగాణ వార్తలు
Published : Oct 27, 2023, 4:16 PM IST
Tractor Stuck on Railway Track at Nalgonda : రైలు పట్టాలపై ట్రాక్టర్ ఇరుక్కుపోవడంతో నల్గొండ జిల్లాలో పల్నాడు ఎక్స్‌ప్రెస్(Palnadu Express) నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మాడుగులపల్లికి చెందిన చెన్నయ్య ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకుని రైలు పట్టాలపై నుంచి అవతలికి దాటేందుకు యత్నించాడు. ఇంతలో ట్రాక్టర్ ట్రాలీ చెరువుపల్లి వెళ్లే మార్గంలో పట్టాలపై ఇరుక్కుపోయింది. రైతు ఎంత ప్రయత్నించినా ట్రాక్టర్ బయటకు రాకపోవడంతో స్థానికులు 100 కాల్కు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
Palnadu Express Stopped at Nalgonda :అదే సమయంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ట్రాక్టర్ ట్రాలీ నిలిచిపోయిన విషయాన్ని అప్పటికే రైల్వే అధికారులకు తెలియజేయడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. అనంతరం జేసీబీ సాయంతో రైల్వే పట్టాలపై ఇరుక్కుపోయిన ట్రాక్టర్ను అతి కష్టంమీద తొలగించారు. రైలు ఆగిపోవడంతో అరగంట సేపు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.