Prathidwani : రాష్ట్రంలో కాలుష్య 'నియంత్రణ' బోర్డు ఉందా?.. అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు
Published : Aug 31, 2023, 9:07 PM IST
Prathidwani : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పని తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మరీ నిరుపయోగంగా మారిందని, ప్రజల విజ్ఞప్తుల్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యవస్థ రద్దుకు సిఫార్సు చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజల సమస్యలను పీసీబీ పరిష్కరించకపోవడంతో.. న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎక్కువ సంఖ్యలో పీసీబీకి చెందిన కేసులు దాఖలవుతున్నాయని ఆక్షేపించింది.
TS Highcourt Serious on PCB : పీసీబీ నిర్వహించే బాధ్యతలు కోర్టు అధికారికి అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరి పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది? అసలు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు లక్ష్యాలు, వారికి నిర్దేశించిన విధులు ఏమిటి? వాటి మేరకు పనిచేయడంలో పీసీబీ ఎక్కడ ఉంది? అధికారాల్లేవా? నిధుల్లేవా? కావాల్సిన యంత్రాంగం లేదా? పీసీబీ స్వతంత్రంగా పనిచేయడంలో ఆ సంస్థకు అడ్డుపడుతున్న సవాళ్లు ఏమిటి? దిద్దుబాటు చర్యలు ఎలా ఉంటే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.