పెద్దపులి వేటాడటం ఎప్పుడైనా చూశారా - ఇదిగో లైవ్ వీడియో చూసేయండి - అడవి పందిపై పంజా విసిరిన పెద్ద పులి
Published : Jan 15, 2024, 10:58 AM IST
|Updated : Jan 15, 2024, 12:32 PM IST
Tiger Attack viral video: మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వు ఫారెస్టులో పర్యాటకులు చూస్తుండగానే పెద్దపులి మాటు వేసి అడవి పందిపై పంజా విసిరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్గా మారాయి. పార్క్లో జంతువులను చూడటానికి పర్యాటకులు సఫారీ వాహనంలో ఎక్కి అడవి లోపలికి వచ్చారు. అలా సఫారీ జీప్లో ఎక్కిన కొందరు టూరిస్టులు జంతువులను చూస్తూ పులులు ఉండే ప్రాంతానికి చేరుకున్నారు.
Tiger Attacks Wild Boar: ఈ క్రమంలో వారికి ఓ పెద్దపులి కనిపించింది. వారంతా పులి ఏం చేస్తుందా అని ఆసక్తిగా గమనిస్తూ ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించసాగారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్దపులి అడవి పందిపైకి దూకి పంజా విసిరింది. అది విలవిల లాడుతుండగా మెడ పట్టి రక్తం తాగింది. నిమిషం వ్యవధిలోనే అడవి పంది పులి పంజాకు ప్రాణాలు విడిచింది. ఈ దృశ్యాలు పర్యాటకులు తమ కెమెరాల్లో, సెల్ ఫోన్లలో బంధించడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు మీరు చూడండి మరి.