సైబర్ సమాచారం చౌర్యం ఆగడాలకు చెక్ పెట్టేది ఎలా?
prathidwani program: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం అంగటి సరకుగా మారింది. అంతా భారీ మొత్తంలో సమాచారం చోరీకి గురి కావడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ, రక్షణరంగ సంస్థలకు చెందిన ఉద్యోగులే కాదు.. విద్యార్థులు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఖాతాదారులు, ఈ కామర్స్ సంస్థల వినియోగదారులు.. మహిళలు, నిరుద్యోగులు, క్రెడిట్‌కార్డ్, డెబిట్ కార్డు వినియోగదారులు.. ఇలా 138 కేటగిరీలకు చెందిన సమాచారం సేకరించి.. అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. దీనిపై మరింత లోతైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని అంటున్నారు. అసలు ఈ మొత్తానికి మూలం ఎక్కడ? అంత డేటా వల్ల వారు పొందిన లాభం ఏమిటి? ఇంతటి డేటా ఒకచోట చేరడానికి అవకాశం ఏమిటి? ఈ డేటా లీకేజీకి అవ్వడానికి కారణం ఏమిటి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సైబర్ డాటా చౌర్యం ఆగడాలకు చెక్ పెట్టేది ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.