శుభ్రం చేస్తుండగా గన్ 'మిస్‌ఫైర్'.. కానిస్టేబుల్ కంటికి గాయం - gun misfire news
gun misfire: సిద్దిపేట పట్టణ శివారులో ఉన్న ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో తుపాకీ శుభ్రపరుస్తున్న క్రమంలో మిస్ ఫైర్ అయ్యింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సుతారి రాజశేఖర్ 2013 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్‌గా హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మాబులేషన్ నిర్వహించారు. అక్కడ ఉపయోగించిన ఆయుధాలను మంగళవారం రాజశేఖర్ క్లీన్ చేస్తున్నాడు. ఆ క్రమంలో ఏకే - 47 గన్‌లో ఉండే చీప్ కదలడంతో బుల్లెట్ ఒకసారిగా వెలుపలికి వచ్చి అతని భుజానికి తాకి కూడి కన్ను మీదుగా బయటకు వెళ్లింది. గమనించిన తోటి పోలీసులు అతన్ని హుటా హుటిన సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు హైదరాబాదులోని సరోజిని కంటి ఆస్పత్రికి తరలించారు.