Telugu Boy Married Taiwanese Girl : ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. తైవాన్ యువతితో చల్లపల్లి యువకుడి ప్రేమ వివాహం - Taiwan country
Published : Sep 5, 2023, 5:45 PM IST
|Updated : Sep 5, 2023, 5:50 PM IST
Telugu Boy Married Taiwanese Girl : రెండక్షరాల ప్రేమ.. దేశాల మధ్య దూరాన్ని కూడా దగ్గర చేసింది. ఆంధ్రా యువకుడు, తైవాన్ యువతి మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి పీటలెక్కింది. ఉద్యోగ రీత్యా తైవాన్ వెళ్లిన ఇక్కడి యువకుడు.. అక్కడి యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. వెంకన్న సాక్షిగా ఒక్కటయ్యారు..: తైవాన్ దేశపు యువతి చల్లపల్లి యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి యువకుడు, తైవాన్ దేశపు యువతి ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు. చల్లపల్లిలో మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు వేమూరి సాయి దినకర్ తైవాన్ దేశం సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా స్థిరపడ్డాడు. అక్కడ ఫిజియోథెరపిస్టు యూటింగ్ లియూ అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరి వివాహానికి సాయి దినకర్ తండ్రి వేమూరి కిషోర్, యూటింగ్ లియూ తండ్రి ఈషెంగ్ లియూ, ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. ద్వారకా తిరుమలలో వివాహం జరగగా రిసెప్షన్ పెండ్లి కుమారుడు స్వగ్రామం ఘంటసాల మండలం దేవరకోటలో నిర్వహించారు.