తెలంగాణ

telangana

Ravindergupta

ETV Bharat / videos

TU VC on EC Meeting : 'వీసీ లేకుండా ఈసీ మీటింగ్ చెల్లదు'

By

Published : May 6, 2023, 6:12 PM IST

TU VC on EC Meeting : కళాశాల విద్యా కమిషనర్​ నవీన్ మిత్తల్​ నిర్వహించిన ఈసీ మీటింగ్ చెల్లదని.. వీసీ లేకుండా ఎన్నిసార్లు ఈసీ మీటింగ్ నిర్వహిస్తారని తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్​గుప్తా ప్రశ్నించారు. వీసీని సంప్రదించకుండా సమావేశం ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. ఈసీ సమావేశానికి హాజరైన తెలంగాణ వర్సిటీ ముగ్గురు ప్రొఫెసర్లు నసీమ, రవీందర్, హారతిలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. సరైన వివరణ ఇవ్వకుంటే సస్పెండ్ చేస్తామని వీసీ రవీందర్​ గుప్తా హెచ్చరించారు. 

యూనివర్సిటీ రిజిస్ట్రార్​గా యాదగిరి అనర్హుడని.. నిర్మలాదేవి రిజిస్ట్రార్​గా కొనసాగుతారన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్​గా నిర్మాలా దేవి నియామకంపై 90 రోజుల్లో ఈసీ ఆమోదం కోరతామని తెలిపారు. ఐఏఎస్ వంటి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి.. వీసీని చిన్నచూపు చూడటం తగదన్నారు. తాను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు చేస్తే.. గవర్నర్​ నియమించారని గుర్తు చేశారు. నవీన్​ మిత్తల్​కు సీసీఎల్​ఏ, బోర్డు ఆఫ్​ ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్​ మొదలైన శాఖలు పెరగడం వల్ల సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారన్నారు. యూనివర్సిటీలో టీచింగ్​ కోసం ఔట్ సోర్సింగ్, రోజువారీ ప్రాతిపదికన నియామకాలు చేపట్టామన్నారు.

ABOUT THE AUTHOR

...view details