Prathidwani : విశ్వవిద్యాలయాలు.. వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయా? - విశ్వవిద్యాలయాల పనితీరుపై నేటి ప్రతిధ్వని
Prathidwani Debate On Telangana universities : సమాజానికి దిక్సూచిగా నిలవాల్సిన విశ్వవిద్యాలయాలు.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. రెండేళ్లుగా ముదిరి.. ముదిరి.. రోడ్డున పడిన తెలంగాణ వర్సిటీ వ్యవహారమే అందుకు తాజా మచ్చు తునక. ఇక్కడ ఉపకులపతి, పాలకమండలి... రిజిస్ట్రార్ల మధ్య రభస.. ఆ వెనక విమర్శల జడి ఎదుర్కొంటున్న కళాశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరు విస్తు గొలుపుతోంది. దీంతోపాటు పలు ఇతర వర్సిటీల్లోనూ పాలన గాడి తప్పింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. ప్రస్తుత ఉపకులపతులు పలువురు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి? రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను చక్కదిద్దేది ఎలా? మన వర్సిటీలు ప్రమాణాలు, నాక్ రేటింగ్‌లలో ఎక్కడ ఉన్నాయి? ప్రమాణాలు, ర్యాంకుల విషయంలో ఎలాంటి సమీక్ష అవసరం? 15 విశ్వవిద్యాలయాలు నిత్యం ఏదొక విషయంతో వార్తల్లోకి వస్తున్నాయి. విద్యార్థుల ఆందోళనలు, విచారణలు, పోరాటాలు ఎందుకు? వర్సిటీల పరిస్థితి చక్కదిద్దడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? రాజకీయ సిఫార్సులతో ఉపకులపతుల నియామకాలు, పోస్టులకు రేట్లు కడుతున్న ధోరణులే ఈ పరిస్థితులకు కారణమా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.