Telangana Police Dance At Ganesh Immersion : గణేశ్ నిమజ్జనంలో స్టెప్పులు వేసిన పోలీసులు.. వీడియో వైరల్ - ట్యాంక్‌బండ్‌పై డాన్స్ చేసిన పోలీసులు
Published : Sep 28, 2023, 3:40 PM IST
|Updated : Sep 28, 2023, 4:36 PM IST
Telangana Police Dance At Ganesh Immersion at Tankbund : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. చిన్నారుల నుంచి మొదలు అందరు గణపయ్యను ఆటపాటలతో గంగమ్మ ఒడికి పంపుతున్నారు. పోలీసులు సైతం భక్తులతో నృత్యాలు చేస్తు నిమజ్జన కార్యక్రమాల్లో మరింత సందడి పెంచుతున్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం పూర్తైన అనంతరం.. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద మధ్య మండలం అడిషినల్ డీసీపీ ఆనంద్ భక్తులతో నృత్యం చేశారు.
వీరితో పాటు ఏసీపీలు సంజయ్, పూర్ణచంద్ రావులతో పాటు ఇతర సిబ్బంది డప్పు చప్పుళ్లకు డాన్స్ చేశారు. ఉదయం నుంచి మహా గణపతి ఖైరతాబాద్ నిమజ్జనంలో భద్రతా నిర్వహించిన పోలీసులు.. అది పూర్తి కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా నిర్వహించిన పోలీసులు ఆనందంలో స్టెప్పులు వేశారు. పోలీసులు నృత్యం చేయడం మొదలు పెట్టాకా.. అక్కడున్న భక్తులు వారిని అడిగి మరీ వాళ్లతో డాన్స్ చేశారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ డివైడర్‌పై తన డ్యాన్సింగ్ స్కిల్స్ ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.