తెలంగాణ

telangana

Bandi Sanjay

ETV Bharat / videos

కాస్కో కేసీఆర్.. త్వరలోనే జైలుకు కేటీఆర్​, కవిత : బండి సంజయ్​ - సింగరేణి సంస్థపై బండి సంజయ్​ కామెంట్స్

By

Published : Apr 7, 2023, 11:08 AM IST

Bandi Sanjay comments on KTR : పదో తరగతి పేపర్ లీక్ కేసులో జైలు నుంచి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్​కు సవాల్ విసిరారు. త్వరలోనే కేసీఆర్ కుమారుడు, కుమార్తె జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిని ప్రజలంతా గ్రహిస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్​పై పీడీ యాక్ట్‌ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది చనిపోయేందుకు కారకులు ఎవరని ప్రశ్నించారు.

Bandi Sanjay comments on Singareni : సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51శాతం అని బండి సంజయ్ అన్నారు. అలాంటప్పుడు ప్రైవేటీకరణ చేసే హక్కు ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. కేసీఆర్​ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసే యోచనలో ఉందని ఆరోపించారు. దాన్ని బీజేపీ అడ్డుకుంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయదని స్పష్టం చేశారు. సింగరేణిలో జరుగుతున్న అన్యాయం అక్కడ కార్మికులకు తెలుసున్న ఆయన.. కేసీఆర్​ కుంటుంబంలో సంవత్సరానికి ఒకరు వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. కుటుంబ పాలన, దోపిడీ, అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని బండి సంజయ్​ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details