ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు సర్వం సిద్ధం - ఓటేస్తే తలెత్తుకుని తిరగొచ్చు
Published : Nov 29, 2023, 9:06 PM IST
Telangana Assembly Elections Polling 2023 : భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఓటు హక్కు. ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం. కానీ చాలా మంది ఓటర్లు.. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు బద్ధకిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణి కాస్త తక్కువగా ఉన్నా.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రం ఎక్కువ మంది ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. కనీసం ఈ సారైనా ఆ పరిస్థితిలో మార్పు రావాలని సామాజికవేత్తలు చెబుతున్నారు.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఓట్ల పండుగకు వేళయ్యింది. ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పర్వదినానికి సర్వం సిద్ధమైంది. ఆ తుది అంకానికి మరికొద్ది గంటలే మిగిలి ఉంది. మన తలరాత ఇంతేలే అని తలొంచుకుని పోవాల్సిన పనిలేదు. ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించుకుని ఓటేస్తే అనంతరం అయిదేళ్లూ తలెత్తుకుని తిరగవచ్చు. అందుకే ఓటుహక్కు పొందడం మన హక్కు మాత్రమే కాదు.. ఓటేయడం మన బాధ్యత అని పెద్దలు ఎంతోకాలంగా చెబుతున్నారు. ఓటెయ్యకుంటే ఓడిపోతాం అని హెచ్చరిస్తునే ఉన్నారు. ఇక నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఎవరి ఓటేయాలో ఎవరి ఇష్టం వారిది. కానీ ఓటేయడం మాత్రం తప్పనిసరి. అయితే ఓటుకు మందు కొందరికి ఎన్నో సందేహాలు.. వాటికి సమాధానాలతో పాటు ఓటు విలువపై అమూల్య సందేశంపైనే నేటి ప్రతిధ్వని.