'కేసీఆర్ కుటుంబ పాలన తరిమికొట్టేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుంది' - బండి రమేశ్ ఎన్నికల ప్రచారం
Published : Nov 18, 2023, 1:40 PM IST
Telangana Assembly Elections 2023 :స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని.. కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించి.. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారాయని మండిపడ్డారు.
Bandi Ramesh Election Campaign in Kukatpally : మాధవరం కృష్ణారావు కనీసం డ్రైనేజీ సమస్యలు పరిష్కరించలేదని రమేశ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తుక్కుగూడ సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను.. అధికారంలోకి రాగానే అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని.. కుటుంబపాలనను తరిమేందుకు తమ పార్టీ కంకణం కట్టుకుందని పేర్కొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ఓ ఛాన్స్ ఇస్తే.. కూకట్పల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.