TDP Former Minister Narayana : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదు.. జగన్కు బుద్ది చెప్పడం ఖాయం : మాజీ మంత్రి నారాయణ - ఏపీ ముఖ్యవార్తలు
Published : Sep 11, 2023, 7:08 PM IST
TDP Former Minister Narayana : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల గృహనిర్బంధం కొనసాగుతోంది. మాజీ మంత్రి నారాయణను పోలీసులు మూడు రోజులుగా నిర్బంధించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో అధికార వైఎస్సార్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. 'చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ బంద్ (TDP Bundh Call) కు పిలుపునిస్తే.. విఫలం చేయడానికి నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు.. ఎవరైనా ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం సరికాదు. చంద్రబాబు ( Chandrababu) అరెస్టు అంతా నాటక ప్రక్రియలో జరిగిందే. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్ పాటిస్తున్నారు. నాయకుల మధ్య సంబంధాలు లేకుండా ప్రభుత్వం బలవంతపు చర్యకు పాల్పడడం తగదు. టీడీపీ హయాంలో ఎన్నడూ ఇలాంటి బలవంతపు చర్యలు మనం చూడలేదు. కానీ, ఇవాళ యువగళం (Yuvagalam) పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారు.. 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు' అని అన్నారు. మాజీ మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి.