తెలంగాణ

telangana

Taliperu Project

ETV Bharat / videos

Taliperu Project Water Level Today : తాలిపేరు ప్రాజెక్టుకు మళ్లీ భారీ వరద.. 25 గేట్లను ఎత్తిన అధికారులు

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 4:48 PM IST

Taliperu Project Water Level Today :తాలిపేరు జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్​గఢ్ నుంచి భారీగా వచ్చి వరద నీరు చేరుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో తాలిపేరు ప్రాజెక్టు(Taliperu Project) జలకలను సంతరించుకుంది. దీంతో తాలిపేరు జలాశయానికి నీటిమట్టం పెరిగింది. వరద పెరగడంతో ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్ల(Taliperu Project 25 Gates Open)ను ఎత్తివేసి.. 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. ఈ మేరకు దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

మరోవైపు గోదావరి ఎగువన ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజ్(Sammakka Sarakka Barrage) నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో 25 అడుగుల ఉన్న గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details