తెలంగాణ

telangana

Students Stuck in Flood Water Video Viral

ETV Bharat / videos

Students Stuck in Flood Water Video Viral : వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులు.. జేసీబీల సాయంతో బయటకు.. వీడియో వైరల్​ - హైదరాబాద్​ భారీ వర్షం

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 4:11 PM IST

Engineering Students Stuck in Flood Water : హైదరాబాద్​లోని గుండ్లపోచంపల్లి మైసమ్మ గూడ వద్ద వరద నీరు భారీగా చేరింది. ఇంజినీరింగ్​ హాస్టల్​ విద్యార్థులు ఉంటున్న అపార్టుమెంట్ల వద్ద వరద నీరు నిలిచిపోయింది. దాదాపు 15 అపార్టుమెంట్లలో మొదటి అంతస్తును పూర్తిగా వరద నీరు ముంచింది. నీరు చుట్టుముట్టడంతో హాస్టల్​ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు.

విద్యార్థులను కాపాడేందుకు 2 జేసీబీలతో సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. మల్లారెడ్డి, సెయింట్​ పీటర్స్​, నర్సింహారెడ్డి కళాశాలల హాస్టళ్ల వద్ద ఈ వర్షపు నీరు.. నడుము లోతుకు చేరడంతో.. బయటకు రాలేక విద్యార్థినులు అవస్థలు పడ్డారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులను ట్రాక్టర్ల ద్వారా గుండ్ల పోచంపల్లి మున్సిపల్​ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. వర్షాల నేపథ్యంలో మల్లారెడ్డి విద్యాసంస్థల్లోని పలు కళాశాలకు ఐదు రోజుల పాటు యాజమాన్యం సెలవు ప్రకటించింది. వసతి గృహం నుంచి విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details