నూతన సంవత్సరం వేళ - ప్రణాళికతో సిద్ధంగా ఉన్న యువత - నూతన సంవత్సరం
Published : Jan 2, 2024, 3:48 PM IST
Students Planning for Future for 2024 Year :కొత్త సంవత్సరం అనగానే యువతలో నూతనోత్సాహం తొణికిసలాడుతుంటుంది. లక్ష్యాలను సాధించాలనీ కొత్త కోర్సుల్లో చేరి జ్ఞానాన్ని పెంచుకోవాలని, పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగాలు సాధించాలనీ, ఇలా అనేక ఆలోచనలు మదిలో మెదలుతుంటాయి. ఎదిగేందుకు నిచ్చెనలే కాదు, అడ్డుపడే అనేక అవరోధాలూ ఈ ప్రయాణంలో ఎదుర్కొంటారు. అయితే గతేడాది జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భవిష్యత్‌కు దారులు వేసుకుంటున్నారు చాలా మంది యువత.
Career Planning for 2024 :నూతన సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే యువత తమ లక్ష్యం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. గత ఏడాది నేర్చుకున్న అనుభవాలను పాఠాలుగా మార్చుకొని పోటీ పరీక్షలకుగానూ ఇతర రంగాల్లోనూ ముందుకెళ్తామని యువత, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరి, 2023 సంవత్సరం ఇచ్చిన అనుభవాల నుంచి ఏం నేర్చుకుని ఆ అవరోధాలను అధిగమిస్తారు? కొత్తగా ఎంచుకున్న లక్ష్యాలు ఏంటో ఆ యువత మాటల్లోనే విందాం.