'మమ్మల్ని వదిలివెళ్లొద్దు మాస్టారూ!' విద్యార్థులంతా ఒకటే ఏడుపు!! - uttar pradesh teacher viral video
Published : Dec 21, 2023, 12:11 PM IST
|Updated : Dec 21, 2023, 3:37 PM IST
Students Crying For Teacher Transfer Viral Video :తమకు ఇష్టమైన ఉపాధ్యాయుడు వేరే ఉద్యోగం వచ్చి వెళ్లిపోతుండటం వల్ల విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. శుభం చౌదరి అనే ఉపాధ్యాయునికి సప్లై ఇన్స్స్పెక్టర్గా ఉన్నత ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల యాజమాన్యం వీడ్కోలు పలికే కార్యక్రమంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తర్ప్రదేశ్లో ఈ ఘటన జరిగింది.
ఏం జరిగిందంటే?
ఉన్నావ్లోని చమియాని నివాసి శుభం చౌదరి. ఆయన 2019 లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొలువుకు ఎంపికయినప్పటికీ ఉద్యోగంలో చేరలేదు. ఈ క్రమంలోనే టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి అర్హత సాధించారు. అనంతరం టార్గావ్ కాంపోజిట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఉత్తర్ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు శుభం చౌదరి. ఎట్టకేలకు 2022 డిసెంబర్ 9న పీసీఎస్ లోవర్ పరీక్షలో ఆయన విజయం సాధించి సప్లై ఇన్స్స్పెక్టర్గా ఉద్యోగం సాధించారు. పాఠశాల నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు తోటి ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.