అటుకులపై 30 దేశాల జాతీయ జెండాలు పెయింటింగ్- 30 సెకన్లలో వేసి విద్యార్థిని రికార్డ్ - flags of 30 countries on flattened rice
Published : Nov 22, 2023, 3:01 PM IST
Student Paints Flags of 30 Countries on Flattened Rice :సాధారణంగా పేపర్‌పై పెయింటింగ్ వేసేవారిని చూస్తుంటాం. కానీ అటుకులపై పెయింటింగ్ వేయడం మీరు ఎప్పుడైనా చూశారా? అసోంకు చెందిన ఓ విద్యార్థిని మాత్రం అటుకులపై 30 దేశాల జాతీయ జెండాలను వేసింది. ఆ విద్యార్థిని ప్రతిభకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
అసోంకు చెందిన మౌ దాస్ అనే విద్యార్థినికి.. ఓ రోజు భోజనం చేసే సమయంలో అటుకులుతో ఏదైనా పెయింటింగ్ వేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే అటుకులపై 30 దేశాల జాతీయ జెండాలను పెయింటింగ్ వేయాలని అనుకుంది. తన ఆలోచనకు ఆచరణ తోడయ్యింది. కేవలం 30 సెకన్ల అతితక్కువ సమయంలోనే వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలను పెయింటింగ్ వేసింది. ఫలితంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మౌ దాస్‌కు స్థానం దక్కింది.
నేను కఛాడ్ జిల్లాలోని సిల్చార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. ఒక రోజు భోజనం చేస్తున్నపుడు నాకు అటుకులపై వివిధ దేశాల జాతీయ పతాకాలు పెయింటింగ్ వేయాలనే ఆలోచన వచ్చింది.వెంటనే ప్రయత్నించి జెండాలను వేయగా.. ఈ గుర్తింపు దక్కింది.
-మౌ దాస్, విద్యార్థిని