రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి దూసుకెళ్లిన కారు - mangaluru car accident
కర్ణాటక మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఎదురుగా వస్తున్న ఓ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలు అమాంతం గాలిలో ఎగిరి కింద పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. మంగళూరులోని ముల్కి పోలీసు స్టేషన్ పరిధిలో గల కిన్నిగొలి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. వారు కూడా స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST