Sonia Gandhi Boat Ride : నిజీన్ సరస్సులో సోనియా బోట్ షికార్.. రాహుల్, ప్రియాంకతో కలిసి టూర్! - sonia gandhi boat ride
Published : Aug 26, 2023, 7:02 PM IST
|Updated : Aug 27, 2023, 6:39 AM IST
Sonia Gandhi Boat Ride : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వ్యక్తిగత పర్యటనపై వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. నిజీన్ సరస్సులో బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లద్దాఖ్ నుంచి శ్రీనగర్‌కు చేరుకున్న ఆమె.. రాహుల్ గాంధీని కలవనున్నారు. రైనావారి హోటల్‌లో గాంధీ కుటుంబం.. బస చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. ఆ హోటల్‌లో గాంధీ కుటుంబానికి పాత జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. రెండురోజుల తర్వాత గాంధీ కుటుంబం గుల్మార్గ్‌ను సందర్శిస్తుందని వెల్లడించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు ఉండబోవని వివరించారు. ప్రియాంక గాంధీ కుటుంబం కూడా సోనియా, రాహుల్‌ను కలవనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Rahul Gandhi Srinagar : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ప్రస్తుతం శ్రీనగర్‌లోనే ఉన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించిన ఆయన.. శుక్రవారం ఉదయం కార్గిల్‌లో బహిరంగ ర్యాలీని పూర్తి చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు.