రాముడి జెండాతో బ్యాంకాక్‌లో స్కైడైవ్- 13 వేల అడుగుల నుంచి దూకిన యువతి - అయోధ్య యువతి స్కైడైవ్
Published : Jan 4, 2024, 1:30 PM IST
Skydiving Ram Flag :ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ యువతి సాహసం చేసింది. అయోధ్య మందిరం చిత్రం, జైశ్రీరామ్ అని నినాదం రాసి ఉన్న జెండాను పట్టుకొని స్కైడైవ్ చేసింది. బ్యాంకాక్‌లో 13 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకింది అనామిక శర్మ అనే యువతి. రాముడిపై భక్తిభావాన్ని ప్రదర్శించేందుకు ఈ పని చేసినట్లు వెల్లడించింది.
రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జనవరి 22న జరగనుండగా అందుకు సరిగ్గా నెల రోజుల క్రితం ఈ సాహసం చేసింది అనామిక. డిసెంబర్ 22న స్కైడైవ్ చేసింది. ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సాహసం చేసినట్లు అనామిక శర్మ తెలిపింది. తండ్రి వృత్తి కారణంగా చిన్నప్పటి నుంచే తనకు స్కైడైవింగ్ పట్ల ఆసక్తి ఏర్పడినట్లు పేర్కొంది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా తన వంతు ప్రయత్నంగా స్కైడైవ్ చేసినట్లు వివరించింది. తన సాహసానికి స్వస్థలంతో పాటు బ్యాంకాక్లోనూ ప్రశంసలు దక్కాయని అనామిక తెలిపింది.
అయోధ్య రామాలయంలో ఇచ్చే ప్రసాదం ఇదేనట- తింటే ఆరోగ్యానికి మేలు!
ఎన్నికల అస్త్రంగా 'రామ మందిరం'- బీజేపీ 15రోజుల ప్లాన్ రెడీ- RSSతో కలిసి కార్యక్రమాలు!