తెలంగాణ

telangana

Shivvaram Crocodile park Attracts Visitors In Mancherial

ETV Bharat / videos

శివ్వారం అభయారణ్యంలో మొసళ్ల ఆనవాళ్లు - ఆనందం వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులు

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 12:14 PM IST

Shivvaram Crocodile park Attracts Visitors InMancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శివ్వారం మొసళ్ల అభయారణ్యంలో మొసళ్ల సంచారంతో పర్యాటకుల్లో సందడి నెలకొంది. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలోని గోదావరి తీరాన్ని అనుకొని 36.29 చ.కీ.మీల వైశ్యాలంలో శివ్వారం గ్రామ శివారులో మొసళ్ల అభయారణ్యం ఉంది. 1987లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మార్ష్ జాతికి చెందిన మొసళ్లు నివసిస్తూ ఉండేవి. వీటినే మగ్గర్ మొసళ్లు అని కూడా అంటారు. ఇక్కడ స్వచ్ఛమైన నీరు పారుతూ ఉండడం వాటి ఉనికికి వరంగా మారింది. భూమిపైనా కూడా ఇవి నివసించగలవు.

Crocodiles Park In Shivvaram Mancherial :అయితేగోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడంతో అన్నారం బ్యాక్ వాటర్ వల్ల ఇక్కడ మొన్నటి వరకు నీరు నిండుకుండలా ఉండేవి. దీంతో మొసళ్లకు ఇక్కడ ఉనికి ఉందా అనే ప్రశ్న ఉండేది. ప్రస్తుతం బ్యారేజీలో నీటి నిల్వ తగ్గడంతో మొసళ్ల ఆనవాళ్లు కన్పించాయి. పర్యాటకులు, జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి పలు సౌకర్యాలు కల్పించి మరింత అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details