రమాదేవి పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎక్స్ప్లోరా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకున్న విద్యార్థులు
Published : Nov 4, 2023, 11:37 AM IST
Science Fair at Ramadevi Public School in Rangareddy :రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ రావి చంద్రశేఖర్ హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. సైన్స్ ఎక్స్ప్లోరా (Science Explora), యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన 300కు పైగా వివిధ నమూనాలు ఆకట్టుకున్నాయి.
వీటిలో ప్రధానంగా చంద్రయాన్, శాస్త్ర సాంకేతిక అంశాలు, జీవన విధానం, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిద్యం వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాలలో అవగాహన అవసరమని రావి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు.. భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేయడానికి దోహదపడతాయని పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఖమర్ సుల్తాన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్లు, రమాదేవి ట్రస్ట్ రావిచంద్ర శేఖర్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.