Sanghavi Brother About LB Nagar Murder Case : 'శివను శిక్షించండి.. బయటకొస్తే మా అక్కను చంపేస్తాడు.. వాళ్ల చెల్లి కూడా గతంలో..' - ఎల్బీనగర్ సంఘవి తమ్ముడి ఇంటర్వ్యూ
Published : Sep 4, 2023, 1:15 PM IST
Sanghavi Brother About LB Nagar Murder Case :హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడిలో ఓ యువకుడు మృతి చెందగా.. సంఘవి అనే యువతి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా యువతి మరో సోదరుడు రోహిత్ స్పందించారు. నిందితుడు శివకుమార్ ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము ఊహించలేదని అన్నారు. శివ గతంలోనూ తమ సోదరిని వేధించగా హెచ్చరించినట్లు తెలిపారు.
LB Nagar Murder Case Latest Updates :10వ తరగతి చదివే సమయం నుంచే నిందితుడు తమ అక్కను వేధిస్తున్నాడని సమాచారం ఉందని.. వాళ్ల చెల్లి కూడా అక్కకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు ఘటన తర్వాత తెలిసిందని తెలిపారు. బంధువుల నుంచి సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లానని.. తాను వెళ్లేసరికి గది నిండా రక్తపు మరకలు ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నయ్య చనిపోయాడని.. తీవ్ర గాయాలతో ఉన్న అక్క ప్రస్తుతం చికిత్స పొందుతోందని వివరించారు. ప్రేమోన్మాది శివను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతడు బయటకు వస్తే అక్క ప్రాణాలకు ముప్పు ఉందని.. అతడిని శిక్షించి తమకు న్యాయం చేయాలంటున్న రోహిత్‌తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..