తెలంగాణ

telangana

Sabitha IndraReddy

ETV Bharat / videos

KCR Rangareddy District Tour : రేపు రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి - కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సబితా

By

Published : Jun 18, 2023, 3:58 PM IST

Sabitha IndraReddy Reviewed arrangements for KCR Tour : రాష్ట్రంలో దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు హరితోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అట‌వీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప‌చ్చద‌నం పెర‌గ‌డానికి విశేషంగా చేసిన కృషి.. ఆ ఫ‌లితాల గురించి ప్రజ‌ల‌కు వివ‌రించాల‌ని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, ప‌ట్టణాల్లో పుడమి పులకించేలా.. ప్రకృతి ప‌ర‌వశించేలా.. పెద్ద ఎత్తున మొక్కలు నాటాల‌ని పేర్కొంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరులో హరితహార కార్యక్రమంలో భాగంగా.. రేపు మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సభాస్థలిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. సభా ఏర్పాట్లపై అధికారులు, భద్రతా సిబ్బంది, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంత్రి సమీక్షించారు. పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున వస్తున్నందున.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details