తెలంగాణ

telangana

Huts Demolition in Khammam

ETV Bharat / videos

Huts Demolition in Khammam : ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన గుడిసెల తొలగింపు - Extreme tension at eviction of huts in Khammam

By

Published : Jul 15, 2023, 10:21 PM IST

Removal Huts in Khammam Led to Tension : ఖమ్మంలో భూదాన్‌ భూముల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసుకున్నారంటూ అధికారులు తొలగించేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ  క్రమంలోనే రెవెన్యూ సిబ్బందిని, పోలీసులను వారు అడ్డుకున్నారు. 2014లో ప్రభుత్వమే తమకు పట్టాలిచ్చిందని బాధిత నిర్వాసితులు చెబుతున్నారు. మరోవైపు ఇవి మొత్తం ప్రభుత్వ భూములని అధికారులు అంటున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రెవెన్యూ అధికారులు ప్రొక్లెయినర్లతో అక్కడ పాతిన సిమెంట్‌ స్తంభాలను, కర్రలను తొలగించి గుడిసెలను నేలమట్టం చేశారు. ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి, నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. స్థానికులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

మరోవైపు తమకు ఇళ్ల పట్టాలు ఉన్నాయని బాధిత నిర్వాసితులు తెలిపారు. ప్రభుత్వమే తమకు ఈ భూములను కేటాయించిందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్, రెవెన్యూ యంత్రాగం స్పందించి తమకు న్యాయం చేయాలని ఆందోళకారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details