ఒకేసారి 10 లక్షల మంది యోగా.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు - కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్
ప్రపంచంలోనే అతిపెద్ద యోగాథాన్తో అంతర్జాతీయ రికార్డులపై గురిపెట్టింది కర్ణాటక ప్రభుత్వం. ఆదివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గవర్నర్‌తో పాటుగా 15,000 మంది విద్యార్థులు ఒకేసారి యోగా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 35 చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం కలిపి దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు, వివిధ రంగాల వారు పాల్గొని ఉంటారని అధికారులు అంచనా వేశారు. జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా.. కేంద్ర ఆయుష్, సాంస్కృతిక శాఖలు ఈ యోగాథాన్ను ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంటున్నందున.. యోగాథాన్‌లో పాల్గొన్న అందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.