Rain in Many Places in Hyderabad : భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షం
Heavy Rain In Hyderabad : రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈరోజు చిరుజల్లులు పలకరించాయి. మధ్యాహ్నం వరకు ఎండకు కాస్త ఇబ్బంది పడ్డ భాగ్యనగర వాసులు.. సాయంత్రం వేళ వరుణుడు పలకరించడంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని సంతోష్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, శామీర్‌పేట, నిజాంపేట, బాచుపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అలాగే కుత్బుల్లాపూర్‌లోని పలుచోట్ల వర్షం కురిసింది. సూరారం, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సుచిత్ర పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడింది. వర్షం ధాటికి పలుచోట్ల నాలాలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచి.. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారులు చెరువులను తలపించాయి. మరోవైరు ఈ భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశం ఉందని.. హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాదచారులు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సూచిస్తున్నారు.