Puvvada Ajay Kumar Latest Comments : పొంగులేటి శ్రీనివాస్‌పై పరోక్షంగా పువ్వాడ ఫైర్.. ఏమ్మన్నారంటే..! - Latest Politics of Telangana
Puvvada Ajay Kumar Comments on Ponguleti Srinivas : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుల కేసుల వ్యవహారానికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. వారు తమ పార్టీ సభ్యులైనా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికైనా ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్‌టీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆర్టీఏ సేవలు ఎలా అందుతున్నాయో వాహనదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రవాణా శాఖలో విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వారి అనుచరులు ఇవాళ దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే..