PRATHIDWANI దేశంలో 160 లోక్‌సభ స్థానాలపై బీజేపీ గురి - దేశంలో 160 లోక్‌సభ స్థానాలపై బీజేపీ గురి
PRATHIDWANI రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు కష్టమని భావిస్తున్న లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగింది. వరుసగా గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీల సంఖ్య పెంచుకుని స్పష్టమైన ఆధిక‌్యతను సాధించిన బీజేపీకి ఈసారి మాత్రం గెలుపుకోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మిత్రపక్షాలు దూరమైన చోట, బలమైన ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాట్నా, హైదారాబాద్‌ల్లో పార్టీ వ్యవస్థాగత నేతలతో శిక్షణ సమావేశాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అసలు దేశంలో బీజేపీ గెలవగలిగిన లోక్ సభ స్థానాలు ఎన్ని? ఏఏ రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి ఉంది? ఎక్కడెక్కడ బలమైన ప్రతిపక్షాలున్నాయన్న అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST