తెలంగాణ

telangana

prathidhwani on Singareni Elections 2023

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 9:18 PM IST

ETV Bharat / videos

మొదలైన సింగరేణి ఎన్నికల కోలాహలం

prathidhwani on Singareni Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక సింగరేణి ఎన్నికలకు వేళ అయింది. దాదాపు ఆరేళ్ల తర్వాత సింగరేణిలో ఎన్నికలు జరగనున్నాయి. గత అక్టోబర్​ నెల సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించనుండగా శాసన సభ ఎన్నికల కారణాల వల్ల అధికారులు ​వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైన సింగరేణి ఎన్నికలు అన్ని అడ్డంకులు, అవాంతరాలు దాటుకుని ఈ నెల 27న జరగనున్నాయి. ఇప్పటి వరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఆరు సార్లు జరిగింది.

SCCL Elections 2023 : ఇందులో మూడు సార్లు ఏఐటీయూసీ గెలుపొందగా టీజీబీజీకేఎస్‌ రెండు సార్లు విజయం సాధించింది. ఐఎన్‌టీయూసీ ఒకసారి విజయం సాధించింది. మరి ఈసారి గెలుపు అవకాశాలు ఎవరి వైపు? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం ఎలా ఉండొచ్చు? సింగరేణి ఎన్నికల్ని ప్రభావితం చేయనున్న అంశాలేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్వల్ప వ్యవధిలోనే కీలకమైన సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇక్కడ ఎలా ఉండొచ్చంటారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details