తెలంగాణ

telangana

Poisonous snake found near apartment in Kanpur

ETV Bharat / videos

Poisonous Snake In Apartment Viral Video : అపార్ట్​మెంట్​ వద్ద నాగుపాము హల్​చల్​.. మొక్కల్లోకి వెళ్లి.. - అపార్ట్​మెంట్​లో పాము హల్​చల్​

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 7:21 AM IST

Poisonous Snake In Apartment Viral Video : ఉత్తర్​ప్రదేశ్​.. కాన్పుర్​లో ఓ అపార్ట్​మెంట్​ ప్రాంగణంలో నాగుపాము హల్​చల్​ చేసింది. గార్డెన్​లో ఉన్న మొక్కల్లోకి చొరబడి దోబూచులాడింది. దీంతో అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటున్న ప్రజలు.. ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చివరకు ఏమైందంటే?

అసలేం జరిగిందంటే?
Viral Video Of A Snake : కోహ్నా పోలీస్​స్టేషన్​ పరిధిలో ఉన్న ఓ అపార్ట్​మెంట్​లోకి పాము చొరబడింది. దాన్ని ఓ వ్యక్తి చూసి అందరికీ తెలిపాడు. అదే సమయంలో ఆ పాము అక్కడే ఉన్న గార్డెన్​లోని మొక్కల్లోకి చొరబడింది. భయభ్రాంతులకు గురైన స్థానికులు.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. వెంటనే వచ్చిన అతడు.. నాగస్వరం వాయించడం ప్రారంభించాడు. చాలాసేపు తర్వాత.. పాము మెలికలు తిరుగుతూ బయటకొచ్చింది. అనంతరం అతడు పామును ఓ బాక్స్​లో తీసుకుని వెళ్లిపోయాడు. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేస్తానని తెలిపాడు. దీంతో అపార్ట్​మెంట్​ ప్రజలంతా ఊపరిపీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details