Kng fisher Air Lines : ఆకాశంలో ఎగరాల్సిన విమానం.. నేలమీదకు వచ్చింది
An airplane on the road in Adilabad: ఒక్కప్పుడు ఆకాశాన పక్షిలా ఎగిరిన విమానాలు .. ఇప్పుడు నేలపై మరో వాహనంపై తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆ విమాన సంస్థకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ సంస్థ అధినేత. ఇంతకీ ఆ విమాన సంస్థ పేరు ఎంటో అని ఆలోచిస్తున్నారా..! మనందరికి తెలిసినవే.. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్. దీని సంస్థ అధినేత మరేవరో కాదు కోట్ల డబ్బులతో విదేశాలకు వెళ్లిపోయిన విజయ్‌మాల్యా. అతను దివాళా తీసినందున కేంద్ర ప్రభుత్వం అప్పులు వసూలు చేసే క్రమంలో ఈ విమానాలను సీజ్ చేసింది. వాటిని విడి భాగాలుగా చేసి విక్రయించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్‌కి చెందిన ఒక విమానాన్ని విడి భాగాలుగా చేసి లారీపై ఎక్కించారు. ఈ లారీ చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకి వెళ్తున్న క్రమంలో ఆదిలాబాద్ జాతీయ రహదారి మీదగా వెళ్లింది. దీంతో స్థానికులందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 2న చెన్నై నుంచి బయలుదేరిందని లారీ డ్రైవర్ చెప్పాడు.