ఆ సినిమా తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లిపోదామనుకున్నా : పవన్ కల్యాణ్
Pawan Kalyan at Warangal NIT : వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో వసంతోత్సవం అట్టహాసంగా మొదలైంది. నిట్‌లో ముడురోజుల పాటు జరగనున్న స్ప్రింగ్ స్ప్పీ వేడుకల ప్రారంభోత్సవం గురువారం రోజున అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు సినీ నటుడు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ రాకతో విద్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
పవన్ కల్యాణ్ వేదికపైకి సుమారు 7 గంటలకి చేరుకున్నారు. నిట్ సంచాలకుడు ఆచార్య రమణారావు, అధ్యాపకులు, నిర్వహణ కమిటీ బాధ్యులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. నేర్చుకోవడం ఎన్నటికి మర్చిపోకూడదని.. అపజయాలు విజయానికి సోపానాలుగా మార్చుకోవాలని వరంగల్ నిట్ విద్యార్థులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అపజయాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఆత్మ విశ్వాసంతో అడుగేయాలని సూచించారు.
‘సినిమా వల్ల నాకెంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఖుషీ సినిమా తర్వాత న్యూజిలాండ్‌లో స్థిరపడదామని ఇమ్మిగ్రేషన్ కాగితాలను కూడా సిద్ధం చేసుకున్నా. తర్వాత కష్టమో... నష్టమో ఈ దేశంలోనే ఉండి, పుట్టినగడ్డకు నావంతు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. నల్గొండలో ఫ్లోరైడ్ బాధితుల కడగండ్లు, ఆదిలాబాద్ తండాల్లో గిరిజన తాగునీటి కష్టాలు.. ఇలా పేదల ఇబ్బందులు నన్ను కదిలించాయి. అలాంటి వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా’ అని పవన్ వెల్లడించారు.
పవన్ కల్యాణ్‌ను చూసేందుకు విద్యార్థులు అత్యుత్సహాం చూపించారు. బారికేడ్ల నుంచి వేదిక దగ్గరకి ఎక్కవ సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. అప్రమత్తమైన భదరాతా సిబ్బంది లాఠీ ఛార్జీ చేశారు. దీంతో ముందు వరుసలో కుర్చున్న కొంత మంది వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఓ మహిళా ఎస్సై వేదికపై నుంచి కిందకి పడిపోయారు.