తెలంగాణ

telangana

Boxer Hussamuddin Interview

ETV Bharat / videos

పంచ్​ కొడితే పతకం రావాల్సిందే - ఒలింపిక్ గేమ్సే లక్ష్యంగా హుసాముద్దీన్‌ - Boxer Hussamuddin story

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 2:18 PM IST

Nizamabad Boxer Hussamuddin Interview : బాక్సింగ్‌ క్రీడాకారులకు నిజామాబాద్ జిల్లా ఒక అడ్డా. బాక్సింగ్‌ క్రీడకు ఎంతో అపురూపం ఈ ప్రాంతం. అందుకే ఈ జిల్లా నుంచి వచ్చిన ఎంతోమంది బాక్సర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న క్రీడాకారులు ఎంతో మంది ఈ గడ్డనుంచే రావడం విశేషం. అదే కోవలోకి వస్తాడు యువ బాక్సర్‌ హుసాముద్దీన్‌. 

Boxer Hussamuddin Arjuna Award : బాక్సర్​ హుసాముద్దీన్‌ చిన్న స్థాయి నుంచి ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా అర్జున అవార్డు(Arjuna Award Qualifier Hussamuddin Interview)కు ఎంపికయ్యాడు. రాబోయే ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. అతనికి గురువు, తండ్రి అన్నీ ఒకరే. అతని శిక్షణలోనే నేర్చుకున్నానని తెలిపారు. పదేళ్ల వయసు నుంచే తనకు బాక్సింగ్​పై ఆసక్తి కలిగిందని చెప్పారు. మరి, ఈ స్థాయికి రావడానికి అతడు చేసిన సాధన, వాళ్ల తండ్రి అందించిన ప్రోత్సాహం గురించి హుసాముద్దీన్ మాటల్లోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details