తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు : ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ - తెలంగాణ ఎన్నికల ప్రచారం 2023
Published : Nov 21, 2023, 5:30 PM IST
Nirmala Seetharaman Fires On KCR : ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని ఆమె పేర్కొన్నారు. నేరేడ్మెట్లోని వాయుపురి రిక్రియేషన్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
BJP Election Campaign In Telangana 2023 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధుల గురించి వివరించారు. రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో నిత్యవసరాల ధరలు పెరిగాయని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ధరలు తగ్గించిన.. కేసీఆర్ ప్రభుత్వం వాటిపై పన్ను తగ్గించడం లేదని విమర్శించారు. భవిష్యత్లో చేపట్టబోయే కార్యక్రమాలను అక్కడి స్థానికులకు వివరించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తంచేశారు.