తెలంగాణ

telangana

nara_bhuvaneshwari_pooja_at_ganapati_temple

ETV Bharat / videos

Nara Bhuvaneshwari and Brahmani met Chandrababu: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్​ - గణేశ్ పూజ

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 5:21 PM IST

Nara Bhuvaneshwari and Brahmani met Chandrababu:అధినేత చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి సహా కుటుంబ సభ్యులంతా రాజమండ్రిలోని క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు. తాజాగా నేడు భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు  చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అక్కడే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. నేడు వినాయక చవితి పురస్కరించుకుని భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఆలయానికి వెళ్లి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.    

రాజమహేంద్రవరంలో... చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ... రాజమహేంద్రవరం నాళం భీమరాజు వీధిలోని గణనాథుడికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబీకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గణపతి  ఆలయ (Ganapati Temple) నిర్వహకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విఘ్నేశ్వరుడ్ని దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.కొంతసమయం ఆలయంలో గడిపిన అనంతరం భువనేశ్వరి తిరిగి విద్యానగర్ లోని శిబిరం వద్దకు వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details