తెలంగాణ

telangana

BRS Leaders Comments on PM Modi

ETV Bharat / videos

MP Nama Nageswara Rao on PM Modi Comments : 'ప్రత్యేక రాష్ట్రంతో తెలంగాణ ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి.. ఆ విషయంలో మేమే నెంబర్​వన్' - నామా కామెంట్స్​ ఆన్ మోదీ

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 7:49 PM IST

Updated : Sep 18, 2023, 7:58 PM IST

MP Nama Nageswara Rao on PM Modi Comments : తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను.. బీఆర్​ఎస్​ లోక్​సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు సభలో తప్పుబట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్ల తెలంగాణ ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయని.. పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయని నామ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. పంట పెట్టుబడి కింద రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నామని అన్నారు. ప్రతి జిల్లాల్లో ఓ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రతి అంశంలోనూ తెలంగాణ అద్భుతంగా రాణిస్తోందని స్పష్టం చేశారు.

MLC Kavitha Reaction on Modi Comments : తెలంగాణ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే.. అవమాన పరిచేలా మాట్లాడుతున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కొత్త పార్లమెంట్ భవనం సాక్షిగా.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు(Women Reservation Bill)కు మోక్షం కలిగితే బాగుంటుందని అన్నారు. చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న బిల్లును.. పార్లమెంటులో ప్రవేశపెట్టి.. రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు తెలపాలని కోరారు.

Last Updated : Sep 18, 2023, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details